Ramam Raghavam: రామం రాఘవం నుంచి..తండ్రి గొప్పదనం తెలిపే ఎమోషనల్ సాంగ్ రిలీజ్

ప్రముఖ కమెడియన్ ధనరాజ్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామం రాఘవం’. సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. పృథ్వి పోలవరపు నిర్మాత. తండ్రీ కొడుకుల ఎమోషనల్ జర్నీగా రాబోతున్న ఈ చిత్రం నుంచి 'తెలిసిందా నేడు' అనే ఎమోషనల్ సాంగ్ చేసారు మేకర్స్.

"తండ్రికి మించిన గురువు..తండ్రి మించిన దైవం ఎవరున్నారు..ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ పోటీ చేశారు. అరుణ్ చిలువేరు స్వరపరిచిన ఈ గీతానికి సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా శ్రీకాంత్ హరిహరన్ పాడారు. 

 ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల రాసిన కథ ఇది. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా. ఆ సినిమా దర్శకులంతా నా గురువులే. వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా. అందరూ తమ తండ్రితో కలిసి ఈ సినిమా చూడండి’ ధనురాజ్ తెలిపాడు. 

Also Read :-  బిగ్‏బాస్ హోస్ట్‏గా తప్పుకున్న కమల్‌ హాసన్‌

ఈ చిత్రంలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వి,  శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.