బూర నర్సయ్య గౌడ్ కి బీజేపీ పార్టీ ఎంత ప్యాకేజీ ఇచ్చిందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మలతో కాలనీ మహిళలు స్వాగతం పలికారు. KTR మునుగోడును దత్తత తీసుకుంటానని చెప్పగానే నియోజకవర్గంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎర్రబెల్లి చెప్పారు. బీజేపీ వాళ్ళు ప్రతీదీ అవహేళనగా మాట్లాడుతున్నారన్న ఆయన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాల మంత్రి అయ్యాడని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీల గురించి ప్రజలు రాజగోపాల్ రెడ్డిని నిలదీస్తున్నారని చెప్పారు.
అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డి పరిస్థితి అద్వాన్నంగా తయారైందని ఎర్రబెల్లి కామెంట్ చేశారు. అమిత్ షాతో కోట్లాడి ఈప్రాంతానికి నిధులు తీసుకొచ్చి ఓట్లు అడగండని డిమాండ్ చేశారు. ఈఅన్ని సర్వేలలు ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా వచ్చాయని స్పష్టం చేశారు. క్రమంలోనే బూర నర్సయ్య గౌడ్ టికెట్ ఆశించాడని... అతనిది ఈ నియోజకవర్గం కాదు కదా మరి టిక్కెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రెండుసార్లు ఎంపీ టిక్కెట్ ఇచ్చినరు.. కేసీఆర్ మళ్ళీ కూడా టిక్కెట్ ఇస్తా అన్నారు వినకుండా పార్టీ మారిండని ఆరోపించారు. బూర నర్సయ్య గౌడ్ కి బీజేపీ పార్టీ ఎంత ప్యాకేజీ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.