తుంగతుర్తి , వెలుగు : అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని సేవాదళ్ యంగ్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్ల శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో సేవాదళ్ యంగ్ బి గ్రేడ్ జిల్లా అధ్యక్షుడు కాసర్ల గణేశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ స్కీముల ప్రభుత్వం కాదని స్కాముల ప్రభుత్వమని విమర్శించారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అక్రమాలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నామని మండిపడ్డారు. తుంగతుర్తిలో అభ్యర్థి ఎవరైనా సరే.. ఆయన గెలుపు కోసం శ్రమించాలని సూచించారు.
అనంతరం సేవాదళ్ యంగ్ బ్రిగేడ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా గంగాధరి శ్రీధర్‌తో పాటు మండలాలకు అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సేవాదళ్ యంగ్ బ్రిగేడ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగి రెడ్డి , వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ కొండ రాజు, నేతలు పెద్ద బోయిన అజయ్, ఉప్పుల రాంబాబు, ఎస్కే హుస్సేన్, అబ్దుల్, సిద్ధిక్, షేక్ అక్బర్, సంపత్ పాల్గొన్నారు.