ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 23 మంది నామినేషన్లు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 23 మంది నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 నియోజకవర్గాలలోని ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు 10 నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఖమ్మం అసెంబ్లీ లో స్వతంత్ర అభ్యర్థిలుగా గుంటి నాగరాజు, బాణాల లక్ష్మాచారి నామినేషన్లు వేశారు. పాలేరులో స్వతంత్ర అభ్యర్థులు గా ఇస్లావత్ రాజేందర్, హలావత్ శోభన్ బాబు, అజ్మీరా కిషన్, అల్లిక వెంకట రమణి నామినేషన్లు దాఖలు చేశారు.  మధిర స్థానానికి అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీ ఫార్మ్స్ పార్టీ నుంచి ఆంబోజ్ బుడ్డయ్య, వైరా నియోజకవర్గం నుంచి విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి గుగులోత్ భావ్ సింగ్, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీ ఫార్మ్స్ పార్టీ నుంచి మాలోత్ శ్యామ్ లాల్ నాయక్ నామినేషన్లు వేశారు.  సత్తుపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా చిప్పలపల్లి వీరయ్య నామినేషన్ పత్రాలు అందజేశారు.

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో... 

జిల్లాలో సోమవారం 11 మంది అభ్యర్థులు 13 నామినేషన్లను వేశారు. పినపాక, ఇల్లెందు, భద్రాచం నియోజకవర్గంలో ఇద్దరు చొప్పున, కొత్తగూడెంలో ఒక్కరు, అశ్వారావుపేటలో నలుగురు నామినేషన్లను వేశారు. పినపాక నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్​ క్యాండెట్లుగా వాసం మంగయ్య, పాల్వంచ దుర్గ నామినేషన్లు దఖాలు చేశారు. ఇల్లెందులో కాంగ్రెస్​ తరుపున చీమల వెంకటేశ్వర్లు, ఇండిపెండెంట్​ క్యాండెట్​గా మోకాళ్ల కృష్ణ వేశారు.  కొత్తగూడెం నుంచి యువతరం పార్టీ తరుపున పొట్రు ప్రవీణ్​ కుమార్,  అశ్వారావుపేట నుంచి బీఆర్​ఎస్​ తరుపున ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇండిపెండెంట్లుగా కల్లూరి కిషోర్​, ఆంగోత్​ కృష్ణ, కుంజా నాగమణి, కంగాల కల్లయ్య నామినేషన్​ దఖాలు చేశారు.  భద్రాచలం నుంచి బీఆర్​ఎస్​ తరుపున తెల్లం వెంకట్రావు, తెల్లం సీతమ్మ, ఇండిపెండెంట్​గా పండ్ర హేమసుందర్​ నామినేషన్లను వేశారు.