భద్రాచలం, వెలుగు : భద్రాద్రిని ముంపు నుంచి కాపాడేందుకు కరకట్టల నిర్మాణం కోసం నిపుణుల కమిటీని ఇతర రాష్ట్రాలకు సీఎం కేసీఆర్ పంపారని, వరదల నుంచి కాపాడి తీరుతామని ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తాతా మధు తెలిపారు.
తెల్లం వెంకట్రావుతో కలిసి ఆయన ఆదివారం సాయిబాబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం ముంపు ప్రాంతం సుభాష్‌నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసంపూర్తిగా నిలిచిన కరకట్ట పనులకు రూ.38కోట్లు మంజూరు చేసిన విషయాన్ని తెలిపారు. తర్వాత దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం, సీతానగరంలో పర్యటించారు. సీతానగరంలో 150 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి.