భద్రాచలం, వెలుగు : నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ ఎల్లప్పుడూ భద్రాచలంలోని తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కార్యాలయాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. భద్రాచలంలో ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డు నిర్మాణం త్వరలో పూర్తవుతుందని చెప్పారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు.