- అధికారులకు నటుడు అలీ దరఖాస్తు
- అనుమతి పత్రాలు అందజేసిన తహసీల్దార్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్‌జిల్లా నవాబ్‌పేట మండలం ఏక్మామిడిలోని ఫాంహౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సినీ నటుడు అలీకి ఆదివారం రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అలీ పేరిట వ్యవసాయ భూమి ఉండగా, అందులో నిర్మాణాలు చేపట్టడం రూల్స్‌కు విరుద్ధమని అధికారులు పనులను అడ్డుకున్నారు.
దీంతో అలీ సోమవారం నవాబుపేట తహసీల్దార్ ఆఫీసుకు వచ్చారు. ఏక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 340, 341, 344, 345లో ఉన్న 5.22 గుంటల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తహసీల్దార్ జయరాం అనుమతి ఇస్తూ ప్రొసీడింగ్స్‌ను అలీకి అందజేశారు.