Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..

Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా  కూతురి పెళ్లి..

టాలీవుడ్ ప్రముఖ నటుడు చిన్నా కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే నటుడు చిన్న కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నా రెండో కూతురు భావన ని అవినాష్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. వీరి వివాహం హైదరాబాద్ లోని అమ్మపల్లి ఆలయంలో జరిగింది. ఈ వివాహానికి చిన్నా కుటుంబ సభ్యులతోపాటూ సన్నిహితులు, స్నేహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమం లో కొందరు సన్నిహితులు వధూవరుల ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అభిమానులు న్యూ కపుల్ కి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

నటుడు చిన్నా విషయానికొస్తే అప్పట్లో పలు తెలుగు సినిమాల్లో హీరో ఫ్రెండ్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా 2009లో చిన్న మెయిన్ లీడ్ లో  నటించిన ఆ ఇంట్లో హర్రర్ థ్రిల్లర్ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది. ఈ సినిమా తర్వాత కొన్నేళ్లపాటు ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న నటుడు చిన్నా ఇటీవలే ప్రారంభమైన "నువ్వు నేను ప్రేమ" అనే సీరియల్ తో మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈ సీరియల్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతోంది.