ఆర్.నారాయణమూర్తికీ ఓ లవ్ స్టోరీ ఉంది.. పెళ్లి వరకు వెళ్లారు కానీ.. డబ్బే కారణమా..!

ఆర్.నారాయణమూర్తికీ ఓ లవ్ స్టోరీ ఉంది.. పెళ్లి వరకు వెళ్లారు కానీ.. డబ్బే కారణమా..!

సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా సినిమాలు తీస్తూ ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి పాటుపడుతూ సమాజసేవకి జీవితాన్ని అంకితం చేసినవారిలో తెలుగు ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఒకరు. అయితే ఆర్ నారాయణమూర్తి కమర్షియల్ సినిమాల పరంగా ఆఫర్లతోపాటూ కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని దర్శకనిర్మాతలు ముందుకొచ్చారు. 

కానీ వాటిని తిరస్కరించి కేవలం సమాజానికి ఉపయోగపడే సినిమాలు మాత్రమే చేస్తానని చెబుతూ తిరస్కరించాడు. చివరికి తన వైవాహిక జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. దీంతో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. అయితే నారాయణమూర్తి వ్యక్తిగత జీవితంలో పెళ్లి లేకపోయినప్పటికీ ప్రేమ ఉంది. ఈ విషయం గురించి చాలామందికి తెలియదు. 

అయితే నారాయణమూర్తి గతంలో తన ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇందులోభాగంగా వయసులో ఉన్నపుడు ఓ అమ్మాయిని ప్రేమించానని ఆమె తల్లిదండ్రలు బాగా డబ్బున్న ధనిక కుటుంబమని తెలిపాడు. అయితే తన ప్రియురాలి కుటుంబం గురించి తనకి ముందే ఏమాత్రం తెలియదని దాంతో వారిని కలిసేందుకు వెళ్ళినప్పుడు అసలు విషయం తెలిసి రియలైజ్ అయ్యానని చెప్పుకొచ్చాడు. 

ఈ క్రమంలో వారి లైఫ్ స్టైల్ కి తన లైఫ్ స్టైల్ కి చాలా వ్యత్యాసం ఉందని దీంతో ఈ విషయం అర్థం చేసుకుని విడిపోయామని తెలిపాడు. అయితే విడిపోయిన సమయంలో తనకి నటుడు అవ్వాలనే కోరిక ఉందని దాంతో మద్రాస్ వెళ్తున్నట్లు చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయానని ఎమోషనల్ అయ్యాడు. అలాగే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని చెప్పి ఇక అప్పటినుంచి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా మాట్లాడలేదని తెలిపాడు. 

అయితే విడిపోయిన సమయంలో కొన్నిరోజులపాటు ఇద్దరూ ఇబ్బందిపడినప్పటికీ తర్వాత ఎవరిలైఫ్ లో వాళ్ళు బిజీ అయ్యామని చెప్పుకొచ్చాడు. అయితే తను ప్రేమించిన అమ్మాయి ఎవరు.? ఎక్కడుంటుంది అనే విషయాలు మాత్రం నారాయణమూర్తి చెప్పడానికి ఇష్టపడలేదు. 

అయితే నారాయణమూర్తి సినిమాల విషయానికొస్తే అప్పట్లో అయన నటించిన ఎర్రసైన్యం, ఎర్ర సముద్రం, వేగు చుక్కలు, ఒరేయ్ రిక్షా తదితర సినిమాలతోపాటు మరిన్ని చిత్రాలు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. అయితే క్రమక్రమంగా కాలం మారుతుండటం, ప్రజల్లో అవగాహన పెరుగటం, కమర్షియల్ సినిమాలకి స్కోప్ పెరగటంతో ఆర్ నారాయణమూర్తి సినిమాలకి ఆదరణ తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం నారాయణమూర్తి సినిమా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.