
టాలీవుడ్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాయత్రి భార్గవి ఓ యూట్యూబ్ ఛానెల్ చేసిన పని సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యింది. ఈక్రమంలో వ్యూస్ కోసం బ్రతికున్నవాళ్ళని చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఇటీవలే నటి గాయత్రి భార్గవి ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వూ కి వెళ్ళింది.
ఈక్రమంలో తన భర్త విక్రమ్ ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఆయన లైఫ్ స్టైల్, జాబ్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఈ ఇంటర్వూలో తెలిపింది. ఇక్కడి వరకూ అంతబాగానే ఉంది. కానీ వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానెల్ ఏకంగా భార్గవి భర్త విక్రమ్ మంచులో కూరుకుని చనిపోయాడని తప్పుడు సమాచారం ఇస్తూ థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
ALSO READ | బెట్టింగ్ యాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై కేసు
దీంతో ఈ విషయం తెలుసుకున్న నటి భార్గవి తన భర్తతో కలసి సోషల్ మీడియాలో వీడియో ద్వారా స్పందించింది. ఇందులోభాగంగా వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ వ్యూవర్స్ ని మిస్ లీడ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. అలాగే తన భర్త విక్రమ్ ని కూడా చూపిస్తూ తన భర్త బ్రతికే ఉన్నాడని తెలిపింది. ఇక పగలనక, రాత్రనక దేశం కోసం సరిహద్దులలో డ్యూటీ చేస్తున్న ఆర్మీ ఉద్యోగులకి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించింది. అలాగే క్షమాపణ చెప్పాలని హెచ్చరించింది. దీంతో నెటిజన్లు కూడా ఆ యూట్యూబ్ ఛానెల్ పై సీరియస్ అవుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి గాయత్రి భార్గవి ఆమధ్య వచ్చిన లక్కీ భాస్కర్ చిత్రంలో బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించి ఆకట్టుకుంది.
బతికివున్నోణ్ణి చంపేసారు కదా...ఇదెక్కిడి దారుణం. pic.twitter.com/17t0QRZdYr
— devipriya (@sairaaj44) March 23, 2025