టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే తెలుగులో మలయాళ ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే మీనాక్షి చౌదరి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూ లో భాగంగా మీనాక్షి చౌదరి తాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ మల్లిడి వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రంలో నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఇందులో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ గత కొంతకాలంగా కొందరు విశ్వంభర చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారాలు చేస్తున్నారని అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.
ఇక తాను నటిస్తున్న సినిమాల గురించి తాను లేదా చిత్ర యూనిట్ ద్వారా తెలియజేస్తానని అంతేతప్ప ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదని తెలిపింది. దీంతో విశ్వంభర సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలకి పులిస్టాఫ్ పండింది.
ALSO READ | జై హనుమాన్ నుంచి బిగ్ అప్డేట్.. హనుమాన్ పాత్రలో రిషబ్ శెట్టి.
ఈ విషయం ఇలా ఉండగా విశ్వంభర చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కారణంగా సమ్మర్ రిలీజ్ వాయిదా పడింది.