Theater Release: ఈ శుక్రవారం (మార్చి 14న).. థియేటర్లలలో చిన్న సినిమాలేదే హవా.. అవేంటో లుక్కేయండి

Theater Release: ఈ శుక్రవారం (మార్చి 14న).. థియేటర్లలలో చిన్న సినిమాలేదే హవా.. అవేంటో లుక్కేయండి

ప్రతి వారం మాదిరే ఈ వారం కూడా (మార్చి 14) థియేటర్లలో కొత్త సినిమాలు వస్తున్నాయి. అయితే, ఈ శుక్రవారం పెద్ద మాస్ మసాలా సినిమాలు కాకుండా కథతో కూడిన చిన్న సినిమాలు వస్తున్నాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్, లవ్ యాక్షన్, హిస్టారిక్ డ్రామా జోనర్స్ లో ఉన్నాయి. మరి ఆ సినిమాలంటో ఓ లుక్కేయండి.  

‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’:

ప్రియదర్శి ప్రధాన పాత్రలో హీరో నాని సొంత నిర్మాణ సంస్థ 'వాల్‌‌ పోస్టర్స్‌‌ సినిమాస్ బ్యానర్‌‌‌‌లో' వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’.రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ శుక్రవారం (మార్చి 14 న) థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో న్ ప్రియదర్శి లాయర్ పాత్రలో నటిస్తుండగా బిగ్ బాస్ కంటెస్టెంట్, వెటరన్ హీరో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలో నటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. దాంతో సినిమా సక్సెస్ పై మేకర్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇటీవలే నాని మాట్లాడుతూ.. ' కోర్టు సినిమాకెళ్ళి మీకు నచ్చకపోతే, జూన్ లో రిలీజ్ అవుతున్న తన "హిట్: ది థర్డ్ కేస్" సినిమా చూడవద్దని ఇంతకంటే బలంగా చెప్పలేనని చెప్పుకొచ్చాడు. దీంతో హీరో నాని చేసిన ఈ వాఖ్యలు ఆసక్తిగా మారాయి.

దిల్‌‌రూబా: 

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా విశ్వ కరుణ్ రుపొంచిందించిన  చిత్రం ‘దిల్‌‌రూబా’. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మించారు. యాక్షన్, లవ్ రొమాంటిక్ జోనర్ లో వస్తోన్న ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ | Triptii Dimri: సామాన్య భక్తురాలిగా క్యూలో నిలబడి త్రిప్తి జ్యోతిర్లింగ దర్శనం.. ఫోటోలు వైరల్

ఇంటెన్స్‌‌ లవ్‌‌ స్టోరీతో పాటు ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌తో సినిమా రానుందని టీజర్, ట్రైలర్ చెప్పకనే చెప్పాయి. ఇకపోతే, 'క’ చిత్రం తర్వాత ప్రేక్షకులు  అంచనాలను తప్పకుండా ఈ సినిమా అందుకుంటుందని మేకర్స్ ప్రమోషన్స్ లో చెప్పుకొస్తున్నారు.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ:

ఇటీవలే మలయాళంలో వచ్చిన లేటెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. ఇందులో కుంచాకో బోబన్‌, ప్రియమణి, జగదీశ్‌, విశాక్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్కడీ ప్రేక్షకులను ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. దాంతో ఈ నెల (మార్చి 14న) తెలుగు థియేటర్స్ లో కూడా రానుంది.

అయితే, ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మార్చి నెలలోనే నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమాకు జితూ అష్రాఫ్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.40 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.

‘ది డిప్లొమాట్‌’:

పాకిస్తాన్ నుండి ఒక భారతీయ అమ్మాయిని స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నించిన భారతీయ దౌత్యవేత్త (జేపీ సింగ్‌)  యొక్క నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో జేపీ సింగ్‌ క్యారెక్టర్ లో జాన్‌ అబ్రహాం నటిస్తున్నాడు.

శివమ్‌ నాయర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్‌ మార్చి 14న)  థియేటర్స్ లోకి రానుంది. ఇందులో సాదియా, కుముద్‌ మిశ్రా, రేవతి తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. 

కేసరి వీర్: లెజెండ్ ఆఫ్ సోమనాథ్:

బాలీవుడ్ యంగ్ హీరో సూరజ్ పంచోలి (Sooraj Pancholi)నటించిన లేటెస్ట్ మూవీ “కేసరి వీర్: లెజెండ్ ఆఫ్ సోమనాథ్”.  ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కను చౌహాన్ నిర్మించారు.

ఈ పీరియాడికల్ డ్రామాలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమా సోమనాథ్ ఆలయాన్ని రక్షించడానికి తుగ్లక్ సామ్రాజ్యంపై హమీర్జీ గోహిల్ చేసిన యుద్ధాన్ని, అతని కథను వివరించే చారిత్రక నాటకం. మార్చి 14న రానుంది.