జంషెడ్‌పూర్ : తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీ సీనియర్ నేషనల్ చాంపియన్‌గా నిలిచాడు. ఇండియా స్టార్ దీపిక కుమారి విమెన్స్ రికర్వ్ టైటిల్ గెలిచింది. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న ధీరజ్ శుక్రవారం జరిగిన మెన్స్ రికర్వ్ ఫైనల్లో 6–2తో హర్యానాకు చెందిన దివ్యాన్ష్ చౌదరిపై విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
విమెన్స్ ఫైనల్లో పెట్రోలియర్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) ఆర్చర్ దీపిక 6–2తో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించిన మరో టాప్ ప్లేయర్ అంకిత భకట్‌ను ఓడించింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తన భర్త అటాను దాస్‌తో కలిసి బరిలోకి దిగిన దీపిక 6–2తో పంజాబ్ జట్టును ఓడించి రెండో స్వర్ణం ఖాతాలో వేసుకుంది.