
అబర్న్‌డెల్ (అమెరికా): తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో రెండో పతకం నెగ్గాడు. కాంపౌండ్ మెన్స్ టీమ్ తరఫున రజతం గెలిచిన ధీరజ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. ఆదివారం రాత్రి జరిగిన కాంస్య పతక పోరులో 23 ఏండ్ల ధీరజ్ 6–-4 తేడాతో స్పెయిన్‌కు చెందిన ఆండ్రెస్ టెమినో మెడియల్‌ను ఓడించాడు.
ఐదు సెట్ల ఉత్కంఠభరిత పోరులో తొలి సెట్ 28–-28తో సమం కాగా, స్పెయిన్ ఆర్చర్ 29–28తో రెండో సెట్ నెగ్గాడు. మూడో సెట్ కూడా 29–29 సమం అవగా.. ధీరజ్ ధైర్యంగా పోరాడుతూ నాలుగో సెట్ గెలిచి స్కోర్ సమం చేశాడు. చివరి సెట్‌లో మూడు పర్ఫెక్ట్ టెన్స్ సాధించి మెడల్ సొంతం చేసుకున్నాడు.