ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

ఎలిమినేషన్స్ దగ్గరపడే కొద్దీ బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లలో కొంతమేర టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. అయితే గతవారం కంటెస్టెంట్ శేఖర్ భాషా బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం ఎలిమినేషన్స్ కి  యష్మీ,  అభయ్, విష్ణుప్రియ,  సీత, నవీన్, పృథ్వీరాజ్, ప్రేరణ, నాగ మణికంఠ, నైనికా తదితరులు నామినేట్ అయ్యారు. 

అయితే ఈ 8మందిలో ఇప్పటికే విష్ణు ప్రియ ఎక్కువ ఓట్లతో ఓట్లతో ముందంజలో ఉంది.అలాగే టాస్కుల విషయంలో కూడా చురుగ్గా పాల్గొంటూ తన ఆటతీరుతో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. కాబట్టి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్లే.  

మిగిలిన ఏడుగురిలో నాగ మణికంఠ, నైనికా మరియు ప్రేరణ తదితరులు ఓట్ల విషయంలో విష్ణుప్రియ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. కాబట్టి వీరు కూడా దాదాపుగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మిగిలిన నవీన్, పృథ్వీరాజ్‌, అభయ్ తదితరులలోనే ఎవరోఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేటి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ట్విస్టులకి కేరాఫ్ గా నిలిచినా బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని విషయం తెలియాలంటే ఆదివారం వరకూ ఆగాల్సిందే.