తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా అరెస్ట్.. 

తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా అరెస్ట్.. 

బిగ్ బాస్ కంటెస్టెంట్ మరియు రేడియొ జాకీ శేఖర్ బాషాని ఈరోజు (అక్టోబర్ 18) సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శేఖర్ భాషా పలు యూట్యూబ్ ఛానెల్స్ లో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన పరువుకి భంగం కలిగిస్తున్నాడాని హర్ష సాయి బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శేఖర్ బాషా ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

అయితే గతంలో యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆర్థికంగా మోసం చేశాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటినుంచి యూట్యూబర్ హర్షసాయి పరారీలో ఉన్నాడు.

ఈ మధ్యకాలంలో శేఖర్ బాషా ఎక్కువగా వివాదాల్లో నిలుస్తున్నాడు. కాగా ఆ మధ్య తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో కూడా కలగజేసుకుని ఏకంగా స్టూడియోలో లై జరుతున్న సమయంలో దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని 2 వారాల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ హర్ష సాయి బాధితురాలి వివాదంలో ఇరుక్కున్నాడు.