Bigg Boss Telugu 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్..

జూబ్లీహిల్స్, వెలుగు: బిగ్ బాస్ తెలుగు సీజన్–8లో నిఖిల్ విజేతగా నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన రియాలిటీ షోలో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించి నిఖిల్​టైటిల్​సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో నిఖిల్ విన్నర్‌గా నిలవగా, రన్నర్‌గా గౌతమ్ వెనుదిరిగాడు. సినీ హీరో రామ్ చరణ్ తేజ్​చీఫ్​గెస్టుగా పాల్గొని నిఖిల్ కు ట్రోఫీని అందజేశాడు. అలాగే రూ. 55 లక్షల క్యాష్ ప్రైజ్, కారును నిఖిల్ గెలుచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన గౌతమ్​కు రూ.25లక్షల క్యాష్​ప్రైజ్​లభించింది. 

టాప్–5లో అవినాష్, టాప్–4లో ప్రేరణ ఎలిమినేట్ కాగా వారిని కన్నడ స్టార్ ఉపేంద్ర, హీరోయిన్​ప్రగ్యా జైస్వాల్ హౌస్ బయటకు తీసుకువెళ్లారు. టాప్ 3లోని ముగ్గురు కంటెస్టెంట్స్‌కి హోస్ట్​నాగార్జున కొంత అమౌంట్‌తో సూట్ కేస్ ఆఫర్ చేయగా ముగ్గురూ రిజిక్ట్ చేశారు. దీంతో కాసేపటికే నబీల్ ఎలిమినేట్ అయ్యాడు. నబీల్‌ను విజయ్ సేతుపతి హౌస్ నుండి బయటకు తీసుకెళ్లాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నపూర్ణ స్టుడియో ఎంట్రన్స్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్  పోలీసులు భద్రతను పర్యవేక్షించారు.

ఐతే మొదట్లోబిగ్ బాస్ ఫైనల్స్ ఎపిసోడ్ కి అల్లు అర్జున్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. కానీ అనుకోకుండా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో చివరిక్షణంలో రామ్ చరణ్ ని సంప్రదించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తెలుగులో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది.