సివిల్స్ 2021 ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు మెరిశారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పోటీ పరీక్షలో సత్తా చాటారు. సివిల్స్ కు ఎంపికైన తెలుగు అభ్యర్థుల జాబితాను చూస్తే.. యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ ర్యాంక్, పూసపాటి సాహిత్య 24వ ర్యాంక్, మంత్రి మౌర్య భరద్వాజ్ 28వ ర్యాంక్ సాధించారు. కె.కిరణ్మయి 56వ ర్యాంక్, శ్రీపూజ 62వ ర్యాంక్, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి 69వ ర్యాంకు, ఆకునూరి నరేశ్ 117వ ర్యాంకు, అరుగుల స్నేహ 136వ ర్యాంకు, బి చైతన్య రెడ్డి 161వ ర్యాంకు, ఎస్.కమలేశ్వర్ రావు 297వ ర్యాంకు, విద్యామరి శ్రీధర్ 336వ ర్యాంకు, దిబ్బడ ఎస్వీ అశోక్ 350వ ర్యాంకు, శరత్ నాయక్ 374వ ర్యాంక్, నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు, ఉప్పులూరి చైతన్య 470వ ర్యాంకు, మన్యాల అనిరుధ్ 564వ ర్యాంకు, బిడ్డి అఖిల్ 566వ ర్యాంకు, రంజిత్‌కుమార్ 574వ ర్యాంకు, పాండు విల్సన్ 602వ ర్యాంకు, బాణావత్ అరవింద్ 623వ ర్యాంకు, బచ్చు స్మరణ్ రాజ్ 676వ ర్యాంకు ను కైవసం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాసింపల్లె కు చెందిన ఆకునూరి నరేష్ కు సివిల్స్ లో ఆలిండియా 117 వ ర్యాంక్ వచ్చింది. వరంగల్ జిల్లా కు చెందిన బొక్క చైతన్య రెడ్డికి 161 వ ర్యాంకు వచ్చింది. ఈమె తండ్రి బి.సoజీవ రెడ్డి గతంలో వరంగల్ డీసీఓగా పని చేశారు. ప్రస్తుతం సాగునీటి శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చైతన్యరెడ్డి పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన శరత్ నాయక్ కు సివిల్స్ లో 374 వ ర్యాంకు వచ్చింది. తండ్రి భాష్యనాయక్ వ్యవసాయం చేస్తుండగా తల్లి యమున మినీ అంగన్వాడీ కార్యకర్త గా సేవలందిస్తున్నారు.
ఆకునూరి నరేశ్ 117వ ర్యాంకు
శరత్ నాయక్ 374వ ర్యాంక్
బి చైతన్య రెడ్డి 161వ ర్యాంకు
శృతి శర్మ (ఆల్ ఇండియా నెంబర్1 ర్యాంక్)
నెంబర్ 1 ర్యాంకర్ ఎవరంటే..
Congratulations to all those who have cleared the Civil Services (Main) Examination, 2021. My best wishes to these youngsters who are embarking on their administrative careers at an important time of India’s development journey, when we are marking Azadi Ka Amrit Mahotsav.
— Narendra Modi (@narendramodi) May 30, 2022
యూపీఎస్సీ సోమవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో శృతి శర్మ ఆల్ ఇండియా నెంబర్1 ర్యాంక్ ను కైవసం చేసుకున్నారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీల్లో శృతి శర్మ ఉన్నత విద్యాభ్యాసం జరిగింది. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ తీసుకున్నారు. మొత్తం 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఈసారి సివిల్స్ కు ఎంపికైన వారిలో 277 మంది జనరల్ కేటగిరి అభ్యర్థులు కాగా, ఆర్థికంగా వెనుకబడిన కేటగిరివారు 73 మంది, ఓబీసీ అభ్యర్థులు 203, ఎస్సీలు 105 మంది, ఎస్టీ అభ్యర్థులు 60 మంది ఉన్నారు. సాధించిన ర్యాంకును బట్టి ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ - 1, గ్రూప్ 2 ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. కాగా, సివిల్స్ కు ఎంపికైన అభ్యర్థులను అభినందిస్తూ ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.
మరిన్ని వార్తలు..