- ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ స్టార్స్ విచారణ
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన సినీ తారల తారల డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అంతా సమసిపోయిందేమోననుకుంటున్న తరుణంలో డ్రగ్స్ కేసులో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సినీ స్టార్స్ కు సమన్లు జారీ చేసింది. ఈనెల 31 నుంచి విచారణ ప్రారంభిస్తున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 22లోగా సినీ స్టార్స్ ను విచారణ ముగించేలా ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. తెలుగు సినిమా స్టార్స్ చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుబాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాస్ తదితరులకు ఈడీ సమన్లు జారీ చేసింది.