పీవీ సింధును కలసిన కమెడియన్ శివారెడ్డి

పీవీ సింధును కలసిన కమెడియన్ శివారెడ్డి

హైదరాబాద్: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన పీవీ సింధును తెలుగు సినిమా కమెడియన్ శివారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని ఆమె నివాసానికి వెళ్లి.. ఒలిపింక్స్ లో పతకం సాధించిన పెద్ద ఫోటోను ఆమెకు బహుమతిగా ఇచ్చారు శివారెడ్డి. మన తెలుగు బిడ్డ కాబట్టే మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేసినట్లు ఈ సందర్భంగా శివారెడ్డి వెల్లడించారు. వ్యక్తిగతంగా కలసి అభినందనలు తెలియజేయడం కోసమే కలిశానని.. తెలుగు జాతి గర్వించే ఘనత సాధించిన పీవీ సింధును  పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడం జరిగిందని  కామెడీ నటుడు శివారెడ్డి తెలిపారు.