Strike in Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమ్మె.. నిలిచిపోనున్న షూటింగ్స్

Strike in Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమ్మె.. నిలిచిపోనున్న షూటింగ్స్

టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood industry)లో సినిమా షూటింగ్స్ కు బ్రేక్ పడనుంది. సినిమా షూటింగ్లకు వెహికల్స్ అద్దెకు ఇచ్చే వెహికల్ ఓనర్స్ అసోసియేషన్  సమ్మెకు పిలుపునిచ్చింది. ఈమేరకు వెహికల్ రెంట్లు, వేతనాలు పెంచేంత్త వరకు బంద్ చేస్తామని తెలుగు సినిమా అండ్ టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ప్రెసిడెంట్ హనీఫ్ తెలిపారు. 

ఇక ఇదే విషయం గురించి అసోసియేషన్ చైర్మన్ హనీఫ్ మాట్లాడుతూ.. గతంలో ఈ సమస్యల గురించి నిర్మాతల మండలికి తెలియజేశాం. అయినా కూడా ఎలాంటి స్పందన రాలేదు. త్వరలో నిర్మాతల మండలితో చర్చలు జరుపుతాం. లేదంటే వేతనాలు, వెహికల్ రెంట్లు పెంచేంత వరకు బంద్ ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. మరి ఈ డిమాండ్స్ పై నిర్మాతల మండలి ఎలా స్పదిస్తుందో చూడాలి.