టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు సి. చంద్ర శేఖర్ రెడ్డి (86) ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లో కన్నుమూశారు. దాదాపు 80 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీయార్, ఎయన్నార్ తో పలు చిత్రాలు రూపొందించిన పీసీ రెడ్డి కృష్టతో అత్యధిక చిత్రాలు తెరకెక్కించారు.ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి టాలీవుడ్ లెజెండరీ నటులతో ఆయన పని చేశారు. అంతేకాదు నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చంద్రశేఖరరెడ్డి 1933 అక్టోబర్ 15 వతేదీన నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేట మండలానికి చెందిన అనుమ సముద్ర గ్రామంలో పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి ఆ గ్రామ మునసబుగా పనిచేశారు. గ్రామంలో మూడవ తరగతి వరకు చదివి పై చదువులకు మద్రాస్ వెళ్లారు చంద్రశేఖర్ రెడ్డి. అక్కడ అన్నయ్య బలరామిరెడ్డి వద్ద పెరిగారు. మద్రాసులో నాలుగవ తరగతి నుండి డిగ్రీ వరకు చదివాడు. అక్కడ ప్రముఖ దర్శకుడు వి. మధుసూదనరావు, వల్లం నరసింహులు ఇతనికి పరిచయమయ్యారు.

ఇవి కూడా చదవండి:

సినీ పరిశ్రమకు మోహన్ బాబు లేఖ

అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు