
త్రిగుణ్ హీరోగా మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో గతేడాది వచ్చిన మూవీ ‘ఉద్వేగం’.ఈ మూవీ 2024 నవంబర్ 29న థియేటర్లలో రిలీజైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. కోర్టు రూమ్ డ్రామాతో ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ప్రకటించారు మేకర్స్.
ఉద్వేగం ఓటీటీ:
‘ఉద్వేగం’ మూవీ నేడు గురువారం (ఏప్రిల్ 3) నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. “ఒక్క కేసు.. ఎన్నో ట్విస్టులు. చివరికి సత్యం జయిస్తుందా? ఈ గ్రిప్పింగ్ కోర్టు రూమ్ డ్రామాను చూడండి కేవలం ఈటీవీ విన్ ఓటీటీలో చూడండి”అనే క్యాప్షన్తో సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మూవీ IMDB 8.3 రేటింగ్ సొంతం చేసుకుంది.
త్రిగుణ్ హీరోగా నటించిన 25వ చిత్రమిది. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, ఐడ్రీమ్ అంజలి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కార్తిక్ కొడగండ్ల సంగీతం అందించాడు. కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జి. శంకర్, ఎల్. మధు నిర్మించారు.
ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. కోర్టు రూమ్ డ్రామాతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతిదీ మంచి విజయం సాధించాయి. ఇటీవలే వచ్చిన కోర్ట్ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసుకుంది. పోక్సో చటంలో ఉండే లుసుగులను కళ్ళకి కట్టినట్లుగా చూపించింది. ఈ క్రమంలో ఉద్వేగం ఓటీటీకి రావడంతో ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.
One case, countless twists! Will truth prevail?
— ETV Win (@etvwin) April 3, 2025
Watch this gripping courtroom drama now!
Only on @etvwin
📺 Stream here: https://t.co/9Lk6jT13Ap#EtvWin pic.twitter.com/DgraVlwKNy
ఉద్వేగం కథ :
ఎలాంటి క్రిమినల్ కేసులనైనా తన చాకచక్యంతో వాదిస్తుంటాడు మహీంద్రా (త్రిగుణ్). అతను (మహీంద్రా) అమ్ములు (దీప్షిక)ను ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో అతని దగ్గరికి ఓ గ్యాంగ్ రేప్ కేసు వస్తుంది. మొదట అతను ఈ కేసు తీసుకోవడానికి నిరాకరిస్తాడు, కానీ తరువాత కొన్ని కారణాల వల్ల కేసును స్వీకరించి, A2 నిందితుడు సంపత్ కోసం వాదిస్తాడు. మరోవైపు ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగార్) అమ్మాయి తరపున ఈ కేసును వాదిస్తాడు.
►ALSO READ | Pooja Hegde: రాహుకేతు పూజలో పాల్గొన్న హీరోయిన్ పూజా హెగ్డే.. వీడియో వైరల్
అయితే ఈ కేసే అతని వ్యక్తి, వృత్తిపరమైన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చివరికి ఈ కేసులో ఏం జరిగింది? అసలు ఆ గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలు ఎవరు? మహీంద్రా వాదించింది న్యాయం వైపా? లేక అన్యాయం వైపా? అనేదే మిగతా ఉద్వేగం కథ.