
టాలీవుడ్ హీరో నవదీప్, దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సిరీస్ 'టచ్ మీ నాట్' (Touch Me Not).కొరియన్ సిరీస్ హి ఈజ్ సైకోమెట్రిక్ రీమేక్గా తెరకెక్కిన టచ్ మీ నాట్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. జియోహాట్‌స్టార్ ఓటీటీ ఇప్పుడు తెలుగులో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీసుకురాబోతోంది.
అందరికీ లైఫ్ లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. కానీ, కొన్నిటినీ ప్రాణం కన్నా జాగ్రత్తగా కాపాడుకోవాలి' అని ట్రైలర్ స్టార్ట్ అయింది. అందులో అనుమానాస్పద వ్యక్తులు చనిపోవడం, దీక్షిత్, నవదీప్ ఇంటెన్స్ గా క్రైమ్ సాల్వ్ చేయడం ఆసక్తిగా ఉంది. ఒక్కొక్కరు తమదైన శైలిలో నిజం కోసం వేటను ప్రారంభించడం ట్రైలర్ లో ఇంపాక్ట్ పెంచుతోంది.
ALSO READ : SSMB29: మహేష్ మూవీ ఒడిషాలో ప్యాకప్.. రాజమౌళి నోట్.. వర్కింగ్ టైటిల్ కన్ఫర్మ్
మంటల్లో కాలిపోతున్న ఓ భారీ భవనం సిరీస్ లో ఆసక్తిగా ఉంది. ట్రైలర్ బట్టి చూస్తుంటే, తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఓ మంచి ఇంటెన్స్ ఉన్న సిరీస్ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతీ ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్న జానర్ ఏదైనా ఉందంటే.. అది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇపుడు ఈ టచ్ మి నాట్ కూడా అదే జానర్లో వస్తుండటం విశేషం. అందులోనూ తెలుగులో కాబట్టి ఇంకా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే, నాగ శౌర్య తో అశ్వథ్థామ మూవీ తీసిన డైరెక్టర్ రమణ తేజ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.