స్టేషన్‌ బెయిలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల

మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పోలీసులు స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. శనివారం (సెప్టెంబర్ 9న) తెల్లవారుజామున విశాఖలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని ఎండాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన క్రమంలో మందస్తుగా పోలీసులు గంటా శ్రీనివాస్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 10న) ఉదయం టీడీపీ నేతల బృందం.. విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్‌ను కలవనున్నారు. ఈ బృందంలో గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు.