ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోయిన డైరెక్టర్.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా..?

ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోయిన డైరెక్టర్.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా..?

ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్ ‘తల’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో స్రృహ తప్పి పడిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లొ ఉన్నట్లుండి ఒక్కసారిగా పడిపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

అయితే సడెన్ గా కింద పడిపోవడంతో డెరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఏమయ్యిందని సినీ వర్గాల్లో ఆందోళన మొదలయ్యింది. ఆయన ఆరోగ్య సమస్యలేమైనా ఎదుర్కొంటున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. 

ALSO READ | జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా.. చిరంజీవి సంచలన ప్రకటన

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన సినిమా తల. రీసెంట్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చూసిన వాళ్లంతా సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన స్పృహ తప్పి పడిపోవడంతో టీమ్ ఆందోళనకు గురయ్యింది.