TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా ఛాంబర్ నుంచే అవార్డులు

TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా ఛాంబర్ నుంచే అవార్డులు

తెలుగు సినిమా ఇండస్ట్రీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడు గురువారం (ఫిబ్రవరి6న) తెలుగు ఫిల్మ్ ఛాంబర్(TFCC) కీలక నిర్ణయం ప్రకటించింది.

ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి సినీ అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజున ప్రతి సంవత్సరం వేడుకలు జరపాలని, ఆ వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని TFCC వెల్లడించింది.

Also Read :- చరణ్‌ RC16 షూటింగ్ స్పాట్‌కు మెగా ప్రిన్సెస్ క్లీంకార

అంతేకాకుండా ఇకపై ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని ప్రకటించింది. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయం తెలిపింది.

ఈ క్రమంలో తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు ఫిల్మ్ ఛాంబర్ అప్పగించింది.