తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) మంచి బాటలో పయనిస్తోంది. ఇవాళ (ఫిబ్రవరి 1న) తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ఫిలిం ఛాంబర్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్, నిర్మాత దిల్ రాజు, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హాజరయ్యారు. దిల్ రాజు, విశ్వక్ చేతుల మీదుగా క్యాంప్ ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'నిత్యం బిజీగా ఉండే ఫిల్మ్ జర్నలిస్టులకు ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ అవసరం కాబట్టి ఇలాంటి క్యాంపులు వల్ల మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయని' దిల్ రాజు అన్నారు.
ALSO READ | పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ ఆ విషయంపై స్పందించిన నాగ చైతన్య..
హీరో విశ్వక్ మాట్లాడుతూ.. 'ఎప్పుడు మా అందరితో సరదాగా ఉండే ఫిల్మ్ జర్నలిస్టులు, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకు ఈ హెల్త్ క్యాంపులు మరింత ఉపయోగపడతాయని' విశ్వక్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సి.ఓ.ఓ భాస్కర్ రెడ్డి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో ఒక M.O.U ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో తెలుగు సినీ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం ఎల్లప్పుడూ మంచి వాతావరణాన్ని అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Producer, TFDC Chairman #DilRaju Garu and Mass Ka Das @VishwakSenActor attended the multi-specialty health camp organized by @FilmJournalists in association with #StarHospitals. On this note, the CEO of Star Hospitals formalized an MOU with the TFJ Association.#VishwakSen #TFJA pic.twitter.com/0ni84OOjKt
— Telugu Film Journalists Association (@FilmJournalists) February 1, 2025