![Hanuman Movie: హనుమాన్ సినిమాకు అన్యాయం జరిగింది : కంప్లయింట్ చేసిన మైత్రీ మూవీస్](https://static.v6velugu.com/uploads/2024/01/telugu-film-producers-council-shock-to-theatre-owners-for-issue-of-hanuman-screening_AjaQgiPykC.jpg)
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వచ్చిన హనుమాన్(Hanuman) సినిమా బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో హనుమాన్ నిలువగా..థియేటర్స్ విషయంలో ముందు నుంచి కొన్ని వివాదాలు జరుగుతూ వస్తున్నాయి. అలా హనుమాన్ కు ఆశించినన్ని థియేటర్లు కూడా రాకపోవడంతో మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మరోసారి హనుమాన్ మూవీ ప్రదర్శన విషయంలో అన్యాయం జరిగింది. దీంతో ..కొన్ని థియేటర్లకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ షాక్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే..హనుమాన్ సినిమాను నైజాంలో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హనుమాన్ నిర్మాత (LLP) వారు 'హనుమాన్ సినిమా 12-01-2024 నుండి ప్రదర్శించాలని..తెలంగాణాలో ముందుగా కొన్ని థియేటర్ల యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకున్నారు.
అయితే ఆ థియేటర్ల యజమానులు మాత్రం ఆ అగ్రీమెంటును ఏ మాత్రం పట్టించుకోకుండా నైజాం ఏరియా థియేటర్లలో..హనుమాన్ సినిమాను ప్రదర్శించకుండా వేరే ఇతర సినిమాలు ప్రదర్శించారు. ఈ విషయమై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి తెలుగు ఫిలిం ఛాంబర్ లోను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లోను ఫిర్యాదు చేశారు.
ముందుగా థియేటర్లు అగ్రీమెంటు చేసుకున్న ప్రకారం..హనుమాన్ సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్స్ కు భారీ నష్టం జరిగిందని..వెంటనే హనుమాన్ సినిమా ప్రదర్శనను ఆయా థియేటర్లో స్టార్ట్ చేయాలంటూ..జరిగిన నష్టం భరించాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆదేశించింది.
అంతేకాకుండా..థియేటర్ల వాళ్లు చేసే ఇటువంటి చర్యల వలన తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నట్లు సూచించింది. అగ్రీమెంటు చేసుకున్న సదరు ఎగ్జిబిటర్లు వెంటనే ఒప్పందాన్ని గౌరవిస్తూ..హనుమాన్ సినిమాకి సత్వర న్యాయం చేయాలని..తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుతున్నట్లు వివరిస్తూ ఒక లేఖ రిలీజ్ చేశారు.
— devipriya (@sairaaj44) January 13, 2024