సరదాగా చేసే పనులతో ప్రాణాలు పోతున్నాయి.. జాగ్రత్త అంటున్న హీరో నిఖిల్

సరదాగా చేసే పనులతో ప్రాణాలు పోతున్నాయి.. జాగ్రత్త అంటున్న హీరో నిఖిల్

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఎలాంటి వార్తయినా యిట్టె వైరల్  అయిపోతోంది. ఈ క్రమంలో కొందరు వ్యూస్ కోసం తప్పుడు వార్తలు షేర్ చెయ్యడం, ప్రచారం చెయ్యడం వంటివి చేస్తున్నారు. దీంతో కొందరు షేర్ చేసిన ఫేక్ న్యూస్ ని నమ్మి ప్రాణాలు మీదకి తెచ్చుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. 

ఈ విషయంపై తెలుగు ప్రముఖ హీరో నిఖిల్ సిద్దార్థ్ సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా స్పందించాడు. ఇందులోభాగంగా "మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎక్స్‌పయిరీ డేట్ చూసుకుని జాగ్రత్తగా కొంటుంటాము. కానీ సోషల్ మీడియాలో ఏదైనా న్యూస్ షేర్ చేసేప్పుడు అది నిజామా కాదా అని తెలుసుకోకుండా ఏమవుతుందిలే అని ఇతరులకి షేర్ చేస్తాం. ఇలా సరదాగా షేర్ చేసిన ఫేక్ న్యూస్ కారణంగా ఒక్కోసారి ఇతరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇతరులకి ఏదైనా న్యూస్ షేర్ చేసేముందు ఒకసారి చెక్ చేసుకుని నిజామా... కాదా అని తెలుసుకుని షేర్ చెయ్యాలని సూచించాడు." సోషల్ మీడియా ని పది మందికి ఉపయోగపడేలా వాడుదాం.. ఇబ్బంది పెట్టేలా కాదు.. అంటూ సందేశం ఇచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఆమధ్య కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిమోట్ అందుకున్న నిఖిల్ ఇటీవలే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా నభా నటేష్ నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

. @actor_nikhil urges us to make social media a platform for spreading positivity and encouragement!

❌ Say NO to fake news and abusive behavior#PostNoEvil #CheduPostCheyavaddu #PledgeToPostNoEvil pic.twitter.com/O59Cdyx8qD

— ??????????? (@UrsVamsiShekar) December 30, 2024