క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన అనన్య నాగళ్ల

క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన అనన్య నాగళ్ల

తెలుగు ప్రముఖ హీరోయిన్ అనన్య నాగాళ్ల ప్రస్తుతం పొట్టేల్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే పొట్టేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నటి అనన్య సినిమా పలువురు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చింది. 

అయితే ఓ రిపోర్టర్ "ఇతర రంగాలలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నప్పటికీ సినీ రంగాన్నే ఎందుకు హైలెట్ చేస్తున్నారని కొందరు నటీనటులు అంటుంటారని, కానీ ఇతర రంగాలలో మాదిరిగా కాకుండా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చే ముందే కమిట్మెంట్ అడుగుతారని దీనిపై మీ స్పందన ఏమిటని అడిగింది. దీంతో అనన్య సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు ఇచ్చే ముందే కమిట్మెంట్ అడుగుతారనేది నిజం కాదని అలాగే తాను ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ సమస్యల్ని ఎదురకోలేదని సమాధానం ఇచ్చింది. 

ALSO READ | తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా అరెస్ట్.. 

ఇదే రిపోర్టర్ ఏకంగా సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చిన హీరోయిన్లకి ఒక రెమ్యనరేషన్, కమిట్మెంట్ ఇవ్వనివారికి ఇంకో రెమ్యూనరేషన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయని దీనిపై మీ కామెంట్స్ ఏమిటని అడిగింది. దీంతో అనన్య సినిమా ఇండస్ట్రీ గురించి తెలియకుండా ఎవరో చెప్పిన మాటలు విని కామెంట్లు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఇక్కడ టాలెంట్ ని బట్టి రెమ్యునేషన్ ఉంటుందిగానీ కమిట్మెంట్ ని బట్టి ఉండదని తెలిపింది.