టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ ప్రభాస్ పెళ్లి గురించి హింట్ ఇవ్వడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ మరో బెస్ట్ ఫ్రెండ్ మంగళూరు బ్యూటీ స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి.
ఇందులో ముఖ్యంగా అనుష్క శెట్టి టాలీవుడ్ కి చెందిన ప్రముఖ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు తనయుడు కె. ప్రకాష్ రావుతో సీక్రెట్ గా పెళ్లయిపోయిందని ప్రచారం జరిగింది. దీంతో అప్పట్లో అనుష్క ఈ విషయంపై స్పందిస్తూ తన పెళ్లిపై తనకంటే ఇతరులు ఎక్కువగా ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో అర్థమా కావడం లేదని తెలిపింది. ఇక పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం లేదని, పెళ్లి చేసుకునేప్పుడు కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది.
ALSO READ | దగ్గుబాటి ఫ్యామిలీ పై కేసు నమోదు.. ఎందుకంటే..?
అలాగే హీరో ప్రభాస్ తో పెళ్లి, డేటింగ్ వ్యవహారంపై కూడా స్పందిస్తూ ప్రభాస్ తనకి మంచి స్నేహితుడని మా మధ్య ఫ్రెండ్షిప్ బంధం తప్ప ప్రేమ, గీమా వంటివి లేవని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభాస్ పెళ్లి మ్యాటర్ వైరల్ అవుతుండటంతో మరోసారి అనుష్క పెళ్లి మ్యాటర్ కూడా వైరల్ అవుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా ఆమధ్య అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో సినిమాలకి కొంతమేర బ్రేక్ ఇచ్చి ఘాటీ అనే సినిమాతో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జగ్రాలమూడి దర్శకత్వం వహిస్తుండగా ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.