బాడీ గార్డ్ అసభ్యకరంగా తాకాడు: టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్

బాడీ గార్డ్ అసభ్యకరంగా తాకాడు: టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్

హిందీ ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ గతంలో తనకి జరిగిన ఓ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులోభాగంగా తాను అప్పట్లో ఓ ప్రోగ్రామ్ విషయమై కజికస్థాన్ వెళ్లానని ఈ క్రమంలో ప్రోగ్రామ్ జరుతున్న సమయంలో స్టేజ్ పైకి వెళుతుండగా ఓ బాడీ గార్డ్ అసభ్యకరంగా తాకాడని తెలిపింది. అయితే మొదటిసారి తాకినప్పుడు పొరపాటుగా చేశాడేమో అనుకున్నానని కానీ రెండోసారి కూడా తాకే ప్రయత్నం చేయడంతో సీరియస్ గా చూశానని దాంతో అతడు క్షమాపణ చెప్పాడని వెల్లడించింది. 

అయితే కజికిస్తాన్ బాడీ గార్డ్ కి హిందీ, ఇంగ్షీషు మాట్లాడటం రాదని దాంతో అతడితో ఈ సంఘటన గురించి వాదించకుండా అక్కడినుంచి వెళ్లిపోయానని తెలిపింది. ఇలాంటి సంఘటనలు తన సినీ జీవితంలో తరచుగా చూసేదానినని దీంతో తన తల్లికి చెప్పడంతో పలు సూచనలు, జాగ్రత్తలు చెప్పిందని చెప్పుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు మైక్రోఫోన్ ని ఉపయోగించడం, అలాగే మేకప్ ఆర్టిస్టులు అనవసరంగా తాకాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయాలని సూచించిందని తెలిపింది.

Also Read : రీతూనా.. మజాకా.. దూసుకెళ్తుందిగా..!

ఈ విషయం ఇలా ఉండగా నటి  అవికా గోర్ బాలికా వధు అనే సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ ని తెలుగులో కూడా చిన్నారి పెళ్ళికూతురు గా డబ్ చేసి ప్రసారం చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రముఖ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బ్లడీ ఇష్క్ అనే హర్రర్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.