కొన్ని రోజలుగా టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత, తాడిపత్రి టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో శనివారం మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) లో కంప్లైంట్ చేసింది.
ఇందులోభాగంగా మా ట్రెజరీ, ప్రముఖ హీరో శివ బాలాజీ కి లిఖిత పూర్వకంగా రాసిన కంప్లైంట్ ని అందజేసింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తాను కూడా సీమబిడ్డనేనని రాగిసంగటి, నాటు కోడి తిని పెరిగానని జేసీకి వార్నింగ్ ఇచ్చారు. అయితే తాను గతంలో మహిళల సంరక్షణ కోసం చేసిన వాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశాడని అలాగే అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించాడని వాపోయింది.
Also Read : డబుల్ ఫన్ అందించేందుకు రెడీ అవుతున్న మ్యాడ్ స్క్వేర్
సినిమా ఇండస్ట్రీలో పని చేసే మహిళల్ని బాడీ షేమింగ్ చేస్తూ అనుచిత వాఖ్యలు చేశాడని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, ట్రెజరీ శివబాలాజీ ని కోరినట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం తాను సినిమాలు మానేసి బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నానని కానీ ఇప్పుడు అనవసరంగా తన పేరుని ప్రస్తావిస్తూ అనుచిత కామెంట్లు చేస్తున్నారని వాపోయింది.