ప్రేమ పై స్పందించిన మీనాక్షి చౌదరి.. ప్రేమికుడెవరంటే..?

టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంక్రాంతికి వస్తున్నాం టీమ్ యాంకర్ సుమ ఇంటికెళ్లి సందడి చేశారు. ఈ ఇంటర్వూలో హీరో వెంకటేష్, సుమ, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు సుమ ఇంట్లో సినిమా ముచ్చట్లు చెబుతూ అలరించారు. ఈ ఇంటర్వూ ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు. 

అయితే ఈ ప్రోమోలో మొదటిగా హీరో వెంకటేష్ సుమ ఇంటికి వెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. మా సినిమా ఇంతపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు మీ ఇంటికొచ్చి ఇంటర్వూ తీసుకోవాలని ఉందని చెప్పడంతో సుమ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత సంక్రాంతి వంటకాలు ఆరగిస్తూ సినిమా విశేషాలు, డైలాగులు చెబుతూ అలరించారు. ఈ క్రమంలో యాంకర్ సుమ మీనాక్షి చౌదరి లవ్ గురించి చెప్పాలని అడిగింది.

ALSO READ | నెపోటిజంపై స్పందిస్తూ స్టార్ హీరోపై ప్రియాంకా చోప్రా సంచలనం..

దీంతో మీనాక్షి చౌదరి లవ్ కన్ఫెషన్ ఉందని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అలాగే మీనాక్షి చౌదరి బాయ్ ఫ్రెండ్ ఎవరా అంటూ నెటిజన్లు ఇంటర్ నెట్లో తెగ వెతుకుతున్నారు. ఇరాక్ ఈ ఇంటర్వూ ఫుల్ వీడియోని ఆదివారం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఫ్యామిలీ & కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న సంక్రాంతికి కానుకగా రిలీజ్ అయింది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. టాక్ బాగుండటంతో ఫ్యాన్,ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో పలు చోట్ల షోలు పెంచారు.