తెలుగు ప్రముఖ హీరోయిన్ నందిని రాయ్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ క్రమంలో మెట్ల మార్గంలో మోకాళ్ల పర్వతం వద్ద నుంచి మోకాళ్లపై నడుస్తూ కొండపైకి వచ్చింది. అనంతరం తిరుమలేశుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల నుంచి ఆశీర్వచనాలు తీసుకుంది.
కొందరు భక్తులు నందిని రాయ్ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కొందరు నెటిజన్లు నందిని రాయ్ ని అభినందిస్తున్నారు. అలాగే హీరోయిన్ హోదాలో ఉన్నప్పటికీ ఎటువంటి స్పెషల్ దర్శనం తీసుకోకండా కేవలం సామాన్య భక్తురాలిలా వెంకన్న ని దర్శించుకోవడం గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నందినీ రాయ్ టాలీవుడ్ కి చెందిన నటి అయినప్పటికీ మొదటగా హిందీలో ఫ్యామిలీ ప్యాక్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగులో మోసగాళ్ళకి మోసగాడు, సిల్లీ ఫెలోస్, వారసుడు, హార్మోన్స్ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే ప్రముఖ రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ 2వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వెబ్ సీరీస్, సినిమాలు అంటూ బిజీబిజీగా గడుపుతోంది.