త్రివిక్రమ్ పై కంప్లైంట్ చేసినా పట్టించుకోరా అంటూ పూనమ్ కౌర్ సంచలనం..

త్రివిక్రమ్ పై కంప్లైంట్ చేసినా పట్టించుకోరా అంటూ పూనమ్ కౌర్ సంచలనం..

ఒకప్పుడు వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే పూనమ్ కౌర్ ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ తరచూ కాంట్రవర్సీలలో నిలుస్తోంది. 

ఆదివారం పూనమ్ కౌర్ ట్విట్టర్ లో షేర్ చేసిన ట్వీట్ సోసిల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులోభాగంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై చాలా కాలం క్రితం మా అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని వాపోయింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ నా ఆరోగ్యం,  ఆనందాన్ని ప్రభావితం చేసి నా జీవితాన్ని నాశనం చేసిన తర్వాత కూడా అతడిని  ఇంకా ఇండస్ట్రీ పెద్దగానే చూస్తోంది అంటూ పేర్కొంది. దీంతో ఈ సంచలనంగా మారింది. 

Also Read : ఆ స్టార్ హీరో భార్య అల్లు అర్జున్ కి బిగ్ ఫ్యాన్ అంట

ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా పలుమార్లు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోపాటూ మరో పొలిటీషియన్, హీరోపై సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. అలాగే ఆమధ్య జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసింది. అయితే ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ గెలిస్తే సంచలన నిజాలు బయటపెడతానని కామెంట్లు చేసింది. కానీ అనుకోకుండా ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు.