
కన్నడ నుంచి తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న శాండిల్ వుడ్ హీరోయిన్స్ లో ప్రణీత సుభాష్ ఒకరు. అయితే నటి ప్రణీత 2010లో "ఏం పిల్లో ఎమ్ పిల్లడో, బావ" తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఇందులో బావ సినిమా సొప్పర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ప్రణీత పల్లెటూరి యువతి పాత్రలో కనిపించడంతో తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత కూడా ప్రణీత తెలుగుతోపాటు కన్నడలో ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణించింది.
ALSO READ | Anchor Anasuya: అనసూయ ని ఆంటీ అన్న ఆకతాయి.. దమ్ముంటే రారా అంటూ సీరియస్..
అయితే ఈమధ్య నటి ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పడూ తనకి సంబందించిన ఫోటోలు వీడియోలు వంటివి షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని బాగానే అలరిస్తోంది. అయితే ఇటీవలే ప్రణీత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రణీత పారిస్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. ఇందులోభాగంగా సూట్ దుస్తులు ధరించి ఫోటోలకి ఫోజులిచ్చింది. ఈక్రమంలో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ప్రణీత ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అంతేకాకుండా పెళ్లయిన తర్వాత గ్లామర్ షోకి దూరంగా ఉన్న ప్రణీత ఒక్కసారిగా ఇలా కనిపించేసరికి షాక్ అవుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా 2021లో ప్రణీత బెంగళూరు కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త "నితిన్ రాజు" ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన తర్వాత సినిమాలపై పెద్దగా దృష్టి సారించలేకపోయింది. దీంతో ప్రస్తుతం మళ్ళీ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రణీత తన కుటుంబ సభ్యులతో కలసి కర్ణాటకలోని బెంగళూరులో ఉంటున్నట్లు సమాచారం.