Radhika Apte: తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హీరోయిన్ రాధికా ఆప్టే తెలుగు సినీ ప్రేక్షకులకి సుపరిచితమే. అయితే నటి రాధికా ఆప్టే పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాధికా ఆప్టే సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది.
ఈ క్రమంలో తన బిడ్డతో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత మొదటగా తల్లి పాలు పట్టించే పని పూర్తీ చేశానని క్యాప్షన్ పెట్టింది. దీంతో రాధికా ఆప్టే అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో దివ్యేందు శర్మ, టిస్కా చోప్రా, గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మ, నీరజ్ ఘేవాన్, సినీ నిర్మాత జోయా అక్తర్ తదితర సినీ ప్రముఖులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో..హీరోయిన్ త్రిష
ఈ విషయం ఇలా ఉండగా నటి రాధికా ఆప్టే బ్రిటీష్ సింగర్, వయోలిన్ ప్లేయర్ బెనెడిక్ట్ టేలర్ ని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత రాధికా ఆప్టే తెలుగు సినిమాలలో నటించడం మానేసింది. కానీ హిందీ హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం "ది లాస్ట్ డేస్" అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జస్టిన్ లిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అమెరికన్ బయోగ్రాఫికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2025 లో రిలీజ్ కానుంది.