Court OTT Release: ఓటీటీలోకి సూపర్ హిట్ ‘కోర్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Court OTT Release: ఓటీటీలోకి సూపర్ హిట్ ‘కోర్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

నాని నిర్మించిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ మూవీ సూపర్ హిట్ అయింది. మార్చి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. రూ.10కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందిన ఈ మూవీ త్వరలో ఓటీటీకి రానుంది.

కోర్ట్ ఓటీటీ:

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకి దక్కించుకుందని సమాచారం. ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు ఆ ఓటీటీ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. అలా కోర్ట్ మూవీ ఏప్రిల్ 11న ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది.

Also Read:-ఫ్యామిలీతో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న హీరో శర్వానంద్

అయితే, ఈ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను నాని నిర్మాణ సంస్థ లేదా నెట్ ఫ్లిక్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను మేకర్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ మూవీ థియేటర్లలో తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది. ఇపుడు ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.

ఈ మూవీలో లవ్ స్టోరీతో పాటు, పోక్సో కేసు, కోర్టులో వాదనల చుట్టూ ఆసక్తికరంగా కథనం నడిపించాడు దర్శకుడు రామ్ జగదీశ్. డబ్బు బలంతో గవర్నమెంట్ అధికారులను లొంగదీసుకోవడం, చట్టంలోని లొసుగులని వాడుకోవడం కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు. దానికితోడు కోర్ట్ డ్రామా ఇంటెన్స్గా ఉండటంతో మిగతా భాషల్లో కూడా మంచి వ్యూస్ దక్కించుకునే అవకాశం ఉంది.