రివ్యూ: జాతి రత్నాలు

రివ్యూ: జాతి రత్నాలు

రివ్యూ: జాతి రత్నాలు
రన్ టైమ్: 2 గంటల 19 నిమిషాలు
నటీనటులు: నవీన్ పోలిశెట్టి ఫరిదా అబ్దుల్లా,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ,మురళీ శర్మ,నరేష్,గిరిబాబు,తనికెళ్ల భరణి తదితరులు
సినిమాటోగ్రఫీ: సిద్దం మనోహర్
మ్యూజిక్: రథన్
నిర్మాత: నాగ అశ్విన్
రచన,దర్శకత్వం: అనుదీప్
రిలీజ్ డేట్ : మార్చి 11,2021

కథేంటి?
శ్రీకాంత్,శేఖర్,రవి ముగ్గురు జోగిపేట లో పనిపాట లేకుండా చిల్లరగా తిరుగుతుంటారు.ఆ ఊల్లో ఉంటే మర్యాద దక్కడంలేదని హైదరాబాద్ పోయి జాబ్ వెతుక్కునే పనిలో ఉంటారు.ఇంతలో ఓ ఎమ్మెల్యే పై ఎవరో హత్యాయత్నం చేస్తారు.ఆ కేసు వీళ్ల కు చుట్టుకుంటుంది.ఆ కేసునుండి ఎలా బయటపడ్డారు.అది చేసింది  ఎవరు?ఎందుకు చేసారు అనేది సస్పెన్స్.
నటీనటుల పర్ఫార్మెన్స్:
నవీన్ పోలిశెట్టి అద్భుతంగా నటించాడు.అతని కామెడీ టైమింగ్ సూపర్బ్.ఈ సినిమాకు అతని నటన పెద్ద ప్లస్.ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ లిద్దరికి మంచి పాత్రలు దక్కాయి.వీళ్లిద్దరూ కూడా బాగా నవ్వించారు.హీరోయిన్ ఫరిదా చూడటానికి పక్కింటి అమ్మాయిలా నార్మల్ గా ఉంది.ఉన్నంతలో బాగానే చేసింది. మురళీశర్మ,నరేష్,తనికెళ్ల భరణి లు మరోసారి మెప్పించారు. బ్రహ్మానందం గెస్ట్ పాత్రలో మెరిసారు.
టెక్నికల్ వర్క్:
కెమెరా వర్క్ బాగుంది. రధన్ ఇచ్చిన పాటల్లో రెండు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ సూపర్.ఎడిటింగ్ ల్యాగ్ ఉంది.సెకండాప్ కాస్త విసిగిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూయ్స్ రిచ్ గా ఉన్నాయి. వన్ లైనర్ డైలాగులు బాగా పేలాయి.
విశ్లేషణ:
‘జాతి  రత్నాలు’’ కామెడీ సినిమా.లాజిక్ లు ,ల్యాగ్ లు అని చూడకుండా ఎంజాయ్ చేసే టైమ్ పాస్ సినిమా.నవీన్ పోలిశెట్టి ఇరగదీసాడు.స్క్రీన్ ప్లే,కథ ఏం లేకున్నా నవీన్ యాక్టింగ్,టైమింగ్ వల్ల ఆ మైనస్ లు కనపడవు. డైరెక్టర్ కూడా స్క్రీన్ ప్లే,స్టోరీ అని పెద్దగా పట్టించుకోకుండా వన్ లైనర్ ల మీదే ఎక్కువ ఫోకస్ చేసాడు.కామెడీ ఎలా పండించాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నట్టున్నాడు.అందుకే ప్రతీ సీన్లో కామెడీ పుట్టించాడు.డైరెక్టర్ కు కూడా తన బలం కామెడీనే అని బలంగా నమ్మాడు.అదే డెలివరీ చేసాడు.ఫస్టాఫ్ హిలేరియస్ గా సాగుతుంది.సెకండాఫ్ లో ఆ స్పీడ్ తగ్గింది.అయినప్పటికీ మంచి ఆర్టిస్టులు దొరికారు కాబట్టి ఆ ఫ్లో లో వెళ్లిపోతుంది.ఇక క్లైమాక్స్ లో కోర్ట్ రూమ్ సీన్ లో నవీన్ చెలరేగిపోయాడు. అందుకే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సంతృప్తిగా బయటకు వస్తారు. ఓవరాల్ గా ‘‘జాతి రత్నాలు’’ టైమ్ పాస్ చేస్తారు. ఫ్రెండ్స్ ,ఫ్యామిలీ తో సరదాగా ఓసారి చూసేయచ్చు.
బాటమ్ లైన్:  కామెడీ రత్నాలు