కత్తి మహేష్ కు రేపు ఆపరేషన్ 

కత్తి మహేష్ కు రేపు ఆపరేషన్ 
  • నిలకడగా ఉన్న ఆరోగ్యం
  • చెన్నైలోని ప్రైవేటుఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్

చెన్నై: నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన  సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ కు రేపు వైద్యులు ఆపరేషన్ చేయనున్నట్లు సమాచారం. తలకు, కంటికి బలమైన గాయం కావడంతోపాటు తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు నిన్న నెల్లూరు నుండి హుటాహుటిన చెన్నైకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. 
నెల్లూరులో ప్రాథమిక చికిత్స చేసిన రిపోర్టులను స్టడీ చేసి తదుపరి చికిత్స చేపట్టిన చెన్నై డాక్టర్లు రక్తస్రావం నిలిచిపోయేలా చేశారు. ముక్కులో, కంటిలోపల గాయమైనట్లు గుర్తించారు. ఈ గాయాలకు సోమవారం శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది కాబట్టే సోమవారం ఆపరేషన్ చేస్తారని చెబుతున్నారు.