సిరివెన్నెల సీతారామ శాస్త్రికి అస్వస్థత

సిరివెన్నెల సీతారామ శాస్త్రికి అస్వస్థత

హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురి కాగా చికిత్స కోసం కిమ్స్‌ హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆయన పరిస్థితి గురించి అటు కుటుంబ సభ్యులు కానీ.. ఇటు ఆస్పత్రి వైద్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.  ఆయన కొంత కాలంగా న్యుమోనియాతో ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం.  
1986లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమాతో సీతారామశాస్రి పాటల రచయితగా తెలుగు చలనచిత్ర  ప్రస్థానం మొదలైంది. తొలి సినిమాకే ఈయన రాసిన పాటలు సూపర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు ఉత్తమ సినీ గేయ రచయితగా నంది అవార్డు అందుకున్న ఆయనకు తెలుగు చిత్రపరిశ్రమ సొంతం అయ్యారు. ఇప్పటి వరకు వందల పాటలు రాసిన ఆయనకు తొలిసినిమా టైటిల్ ‘సిరివెన్నెల’ ఇంటిపేరుగా మారిపోయింది. 

తీవ్ర అస్వస్థత కాదు.. ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు: కుటుంబ సభ్యులు

సిరివెన్నెల సీతారామశాస్త్రి కి తీవ్ర అస్వస్థత వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. కేవలం న్యుమోనియా తోనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని, రెగ్యులర్ చెకప్ లో భాగమేనని స్పష్టం చేశారు. తీవ్ర అస్వస్థత పరిస్థితుల్లో లేరని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.