
ప్రస్తుతం ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్ల హవా జోరుగా కొనసాగుతోంది. థియేటర్ సినిమాల కంటే ఓటీటీలో వచ్చే వాటికే ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారంలో ఓటీటీలో 20కి పైగా సినిమాలు, సిరీస్లు వస్తోన్నాయి.
అందులో వచ్చే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్స్కి అయితే, ఆడియన్స్ ఇట్టే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీలో వచ్చే సినిమాలు అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రేపు శనివారం నుంచి మార్చి నెల షురూ కానుంది. మరి ఈ మార్చిలో రానున్న తెలుగు కొత్త సినిమాలేంటీ? అవెప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్కి రానున్నాయి? అనేది చూద్దాం.
సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ:
విక్టరీ వెంకటేష్ బ్లాక్ బాస్టర్ పొంగల్ "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ మార్చి 1న ఓటీటీకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టెలివిజన్లోను ప్రసారం కానుంది.
కామెడీ & ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి రూ.300 కోట్లు పైగా కలెక్ట్ చేసి వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి నటించారు. నరేష్, శ్రీనివాస్ అవసరాల, ఉపేంద్ర లిమాయే, విటివి గణేష్, బబ్లూ పృథివీరాజ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు.
తండేల్ ఓటీటీ:
తండేల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాను ఏకంగా రూ.40 కోట్లకు నెట్‍ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు టాక్. నాగ చైతన్య కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ డీల్.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని ఇటీవలే నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది. అన్నీ కుదిరితే మార్చి 7న స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తుందనే రూమర్లు ఉన్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇకపోతే తండేల్ శాటిలైట్ రైట్స్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ సొంతం చేసుకుంది.
మజాకా ఓటీటీ:
మజాకా మూవీ శివరాత్రి (ఫిబ్రవరి 26న) సందర్భంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది.
మజాకా సినిమా విడుదలకు ముందు ఆడియన్స్ నుంచి క్రేజీ టాక్ రావడంతో మంచి ధరకే ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో స్ట్రీమింగ్‍కు తెచ్చేలా ఓటీటీ డీల్ జరిగిందని టాక్. అంటే, మర్చి లాస్ట్ వీక్ లో వచ్చే అవకాశం ఉంది.
బాపు ఓటీటీ:
బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బాపు’. దయా దర్శకత్వంలో రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. తెలంగాణ విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన ఈ మూవీ ఓటీటీ హక్కులను జియోహాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మార్చి సెకండ్ వీక్ లో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది.
లైలా ఓటీటీ:
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. వాలంటైన్స్ డే సందర్భంగా (ఫిబ్రవరి 14న) సినిమా రిలీజై నెగిటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానుంది. త్వరలో లైలా ఓటీటీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.