Telugu Movies: ఈ వారం బాక్సాఫీస్ వ‌ద్ద ధ‌నుష్‌ ఒక్కడే.. రాయ‌న్‌కు పోటీగా థియేటర్లోకి వస్తోన్న తెలుగు సినిమాలు ఇవే!

Telugu Movies: ఈ వారం బాక్సాఫీస్ వ‌ద్ద ధ‌నుష్‌ ఒక్కడే.. రాయ‌న్‌కు పోటీగా థియేటర్లోకి వస్తోన్న తెలుగు సినిమాలు ఇవే!

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ వారం కూడా థియేటర్ తెలుగులో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  అందులో ఏ సినిమా కోసం ఆడియన్స్ ఆతురతగా ఎదురుచూస్తున్నారో చూద్దాం. 

రాయన్ 

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘రాయన్’.  కళానిధి మారన్ సమర్పణలో  సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ధనుష్‌‌‌‌ హీరోగా నటిస్తున్న 50వ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి వీపరీతమైన  రెస్పాన్స్ వచ్చింది. ధ‌నుష్ తమిళంలో డైరెక్ట్  చేసి తెలుగులో డ‌బ్బింగ్ అవుతున్న రాయ‌న్ మూవీపైనే తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. అంతేకాదు ఈ వారం విడుద‌ల అవుతోన్న తెలుగు స్ట్రెయిట్ మూవీస్‌తో పోలిస్తే ధ‌నుష్ రాయ‌న్‌పైనే ఆడియన్స్ ఆశలున్నాయి. 

ఈ మూవీలో నిత్యామీనన్, అనిఖా సురేంద్రన్ హీరోయిన్స్‌‌‌‌ గా నటిస్తుండగా..హీరో సందీప్ కిషన్‌‌‌‌, కాళిదాస్ జయరామ్, సెల్వ రాఘవన్‌‌‌‌, ఎస్‌‌‌‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌‌‌‌గా జూలై 26న ఒకేసారి రిలీజ్ కానుంది. ప్రముఖ ఏషియన్, సురేష్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పి ద్వారా తెలుగులో రాయిన్ విడుదలవుతోంది. ఈ సినిమాకు తెలుగులో దాదాపు 500 నుంచి 600ల థియేట‌ర్ల‌ను కేటాయించిన‌ట్లు స‌మాచారం.

‘పురుషోత్తముడు'

టాలీవుడ్ యువ న‌టుడు రాజ్ త‌రుణ్ ఈమధ్య తన సినిమాల కంటే..ఆయన పేరే ఎక్కువ మోగుతుంది. ఒకవైపు మాజీ ప్రేయసి లావ‌ణ్య వివాదం న‌డుస్తుంటే..మ‌రోవైపు త‌న సినిమాల‌ను వరుసబెట్టి పూర్తి చేస్తున్నాడు. ఇప్ప‌టికే భ‌లే ఉన్నాడే సినిమాతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో ‘పురుషోత్తముడు' గా థియేటర్లోకి రానున్నాడు.

Also Read:-రానా నాయుడు’..సీజన్ 2 అప్డేట్..యాక్షన్ వీడియో షేర్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రామ్‌‌‌‌ భీమన దర్శకత్వంలో శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్‌‌‌‌, ప్రకాష్‌‌‌‌ తెజావత్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజ్‌‌‌‌ తరుణ్‌‌‌‌ కి జోడిగా హాసిని సుధీర్‌‌‌‌ నటిస్తుంది. 

ఆపరేషన్ రావణ్

పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. రాధికా శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా దర్శకుడు వెంకట సత్య..తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కూడా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

రాముడిలో మంచివాడైన ఓ యువ‌కుడు అనుకోకుండా ఎందుకు రావ‌ణుడిలా మారాల్సివ‌చ్చింద‌నే కాన్సెప్ట్‌తో రాబోతుంది. అంతేకాదు..ఆప‌రేష‌న్ రావ‌ణ్ అనే టైటిల్ కు ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్‌‌‌‌ ఆసక్తి రేపుతోంది.  ఈ సినిమాలో చరణ్ రాజ్,తమిళ నటుడు విద్యా సాగర్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె ఇతర ముఖ్యపాత్రలు  పోషిస్తున్నారు.  

గల్లీ గ్యాంగ్‌స్టార్స్‌:

ఏబీసీడీ ప్రొడక్షన్స్‌ సంస్థ తెరకెక్కించిన మూవీ ‘గల్లీ గ్యాంగ్‌స్టార్స్‌’. ధర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక గల్లీలో నివసించే అనాథలు, వాళ్లు ఎదురుకునే సమస్యల సమాహారంగా కథ నడుస్తుందని..క్రైమ్‌ డ్రామాగా మెప్పిస్తుందని ప్రమోషన్స్ లో డైరెక్టర్ ధర్మ చెప్పుకొచ్చారు.  

రామ్ ఎన్ఆర్‌ఐ 

బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా హీరోగా న‌టిస్తోన్న రామ్ NRI. ఈ మూవీ జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని డైరెక్ట‌ర్ ఎన్ ల‌క్ష్మీనందా తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో సీతా నార‌య‌ణ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

వీటితోపాటు హాలీవుడ్ సూప‌ర్ హీరో మూవీ డెడ్‌పూల్ వాల్వ‌రిన్ కూడా శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది.