![సరిగమప టీజర్ వచ్చేసింది](https://static.v6velugu.com/uploads/2022/02/telugu-music-reality-tv-show-..Sarigamapa-teaser-released_VMjaTCIO8z.jpg)
పాపులర్ మ్యూజిక్ రియాలిటీ టీవీ సిరీస్... ‘సరిగమప సూపర్ స్టార్స్’ ఫస్ట్ టీజర్ వచ్చేసింది. ఈ షోని శ్రీముఖి హోస్ట్ చేయనుంది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సింగర్లు ఎస్పీ శైలజ, స్మిత, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్... ఈ షోకి జడ్జిలు. ఏదైనా పని చేస్తున్నప్పుడు అలసట తెలియకుండా ఉండేందుకు చాలామంది పాటలు పాడుతుంటారు. పొలం గట్ల నడుమ, ఛాయ్ సెంటర్లో, గిటార్ ప్లే చేస్తూ, కుట్టు మిషన్ కుడుతూ తొట్టెలలో ఉన్న బుజ్జాయికి జోల పాడుతున్న అమ్మ.. ఇలా పాడుతున్న వాళ్ల దగ్గరకు వెళ్ళి ‘చాలా బాగా పాడుతున్నావు’ అని మెచ్చుకుంటారు జడ్జిలు. ‘ప్రతి పాట వెనుక ఒక కథ ఉంటుంది. ఆ పాటే కొంతమందికి జీవితం అవుతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. అందరిదీ ఒకే కల. సరిగమప – ది సింగింగ్ సూపర్ స్టార్’ అంటూ శ్రీముఖి చెప్పిన మాటలు ఈ షోపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఈ నెలలోనే ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు పార్టిసిపెంట్స్ రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ షో జీ తెలుగులో టెలికాస్ట్ అవుతుంది.
సూపర్ క్వీన్స్ వాలెంటైన్స్ డే
సూపర్ క్వీన్ రియాలిటీ షోలో వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్‌కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది జీ తెలుగు. సూపర్ క్వీన్స్ పార్టిసిపెంట్స్ హుషారుగా డాన్స్ చేస్తూ కనిపించారు. ‘త్రినయని’ సీరియల్ ఫేం శ్రీ సత్య, వాళ్ల అమ్మ స్టేజ్ మీద తమ ఎమోషనల్ జర్నీని షేర్ చేసుకున్నారు. డాన్స్, పంచ్ డైలాగులతో పాటు పార్టిసిపెంట్స్ ఎమోషనల్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఆడియెన్స్‌ని కంటతడి పెట్టించేలా ఈ ఎపిసోడ్‌ని డిజైన్ చేశారు. ఈ షో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.