ఆడపిల్ల పుట్టిందని సంబరాలు.. ఆదిలాబాద్ జిల్లాలో మొక్కలు పంపిణీ చేసి సెలబ్రేట్ చేసుకున్న దంపతులు

ఆడపిల్ల పుట్టిందని సంబరాలు.. ఆదిలాబాద్ జిల్లాలో మొక్కలు పంపిణీ చేసి సెలబ్రేట్ చేసుకున్న దంపతులు

ఆడపిల్ల పుడితే చెత్త కుండీలో పడేయటం, నీళ్లలో ముంచి చంపేయడం లాంటి ఘటనలు జరుగుతున్న ఈ రోజుల్లో ఒక జంట మాత్రం సెలబ్రేట్ చేసుకోవడం విశేషంగా మారింది. ఆస్పత్రిలో ఉన్న సిబ్బందికి, బంధువులకు, మిగతా పేషెంట్స్ కు మొక్కలు పంచి సంబరం చేసుకున్నారు. ఆదిలాబాద్ కు చెందిన ఈ జంట చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.

వివరాల్లోకెళ్తే..  ఇచ్చోడ మండలం ముక్రాకే  గ్రామానికి చెందిన అంతర , దీపక్ గాడ్గే దంపతులకు పాప జన్మించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ అస్పత్రిలో  పాపకు  జన్మిచ్చింది తల్లి. దంపతులకు ఆడపిల్ల పుట్టడంతో సంతోషంలో పొంగిపోయారు. 

ALSO READ | రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు అందజేస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మొక్కలు తెప్పించి అస్పత్రిలో పంపిణీ చేశారు. సిబ్బందికి, ఇతర పేషెంట్స్ కు మొత్తం 108 మొక్కలు  పంపిణి చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కూతురు పుట్టడం అంటే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లేనని ఆనందాన్ని వ్యక్తం చేశారు.