కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ ను అమలుచేస్తున్నాయి. దాంతో ఆయాప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్ నుంచి కువైట్ వెళ్లిన కార్మికులు అక్కడ తాము పడుతున్నకష్టాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక తలలు పట్టుకున్నారు. కువైట్ లో ఒక పక్క కర్ఫ్యూ.. మరో పక్క వర్షంతో ఎక్కడికి పోవాలో తెలియక రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. అలా కువైట్ లో ఇబ్బందులు పడుతున్న వాళ్లలో ఆంధ్రపదేశ్ కి చెందిన వారు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తమవాళ్లను ఆదుకోవాలని అక్కడ చిక్కుకున్న వారి బంధువులు వేడుకుంటున్నారు. ఎవరో చేసిన తప్పుకు తమ వాళ్లేందుకు శిక్ష అనుభవించాలని వారు ప్రశ్నిస్తున్నారు. కువైట్ లో తమవాళ్ల ఈ పరిస్థితికి తప్పు ఎవరిదని అడగాలి.. ఎవరిదని చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంకాని దేశంలో భారదేశపు ఆడపడుచులు నరకయాతన పడుతుంటే.. పట్టించుకునే పరిస్థితిలో లేని మన దేశ రాయబార కార్యాలయాలు ఎవరి కోసం ఉన్నట్లు, ఎవరి కోసం పనిచేస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. వలస కార్మికులంటే అంత చిన్న చూపెందుకని వారంటున్నారు.
రాయబార కార్యాలయం సరైన టైంలో స్పందించి ఉంటే.. మన వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని అంటున్నారు. అక్కడ చిక్కుకున్న వాళ్లు అవుట్ పాస్ పోర్ట్ రాక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని బాధితుల బంధువులు అంటున్నారు. దయచేసి భారత రాయభార కార్యాలయం వెంటనే స్పందించి మనవాళ్లను ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు.
For More News..