అవమానం మనిషి స్థాయిని మార్చేస్తుంది. అప్పటిదాకా సామాన్యుడిగా ఉన్న వ్యక్తి అవమానం తర్వాత కసితో కష్టపడి అందనంత ఎత్తుకు ఎదిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల నేపథ్యంలో ఏపీలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. సీఐ తిట్టాడని ఒక కానిస్టేబుల్ సివిల్స్ లో రాంక్ సాధించాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ శ్రీనివాస్ ను వ్యక్తిగత ద్వేషంతో సీఐ 60మంది పోలీసులు ముందు తిట్టిగా ఆ అవమానాన్ని భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 2013లో ఉద్యోగంలో చేరిన ఉదయ్ 2018లో రాజీనామా చేశాడు.
సీఐ తిట్టాడన్న అవమానాన్ని భరించలేని ఉదయ్ కసితో సివిల్స్ కి ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేసి 2023లో జరిగిన సివిల్స్ పరీక్షల్లో 780వ రాంక్ సాధించాడు. 2018లో జరిగిన ఆ అవమానమే తనలో సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలన్న కసిని పెంచిందని అన్నారు ఉదయ్. తనను ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపిక చేసే అవకాశం ఉందని, ఇంతటితో ఆగకుండా కస్టపడి చదివి ఐఏఎస్ కు ఎంపిక కావటమే తన లక్ష్యమని అన్నారు ఉదయ్. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఉదయ్ 5సంవత్సరాల వయసులోనే తల్లిని, ఇంటర్ చదివే సమయంలో తండ్రిని క్లొపోయాడు. నాయనమ్మ సంరక్షణలో పెరిగిన ఉదయ్ ఆమె ఆశీర్వాదంతోనే ఈ విజయం సాధించానని అన్నారు .