అజ్ఞాతవాసి సినిమాని రీ రిలీజ్ పై నాగవంశీ అంతమాట అనేశాడు..?

అజ్ఞాతవాసి సినిమాని రీ రిలీజ్ పై నాగవంశీ అంతమాట అనేశాడు..?

ఈమధ్య టాలీవుడ్ లో పాత సినిమాల రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. దీంతో ఒకప్పుడు సూపర్ దోపరా హిట్ అయిన సినిమాలని మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేసినాసరే అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇక కొందరైతే ఏకంగా సినిమా చూడటానికెళ్లి థియేటర్స్ లో పాటలకి స్టెప్పులెయ్యడం, కొన్ని సీన్స్ ని రీ క్రియేట్ చెయ్యడం వంటివి చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. అయితే ఇటీవలే ప్రముఖ ప్రొడ్యూసర్ నాగవంశీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా గురించి ఓ ఇంటర్వూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే రీ రిలీజ్ ట్రెండ్ గురించి మాట్లాడుతూ అప్పట్లో మ్యూజికల్ గా మంచి హిట్ అయిన సినిమాలు రీరిలీజ్ చేయడంతో పాటలని ఎంజాయ్ చెయ్యడానికి ఆడియన్స్ వెళ్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే ఇప్పటివరకూ రీ రిలీజ్ అయిన సినిమాలన్నీ మంచి మ్యూజికల్ హిట్స్ అని అందుకే ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఇంటర్వూ చేసే వ్యక్తి సరదాగా అజ్ఞాతవాసి సినిమాని రీ రిలీజ్ చెయ్యొచ్చు కదా అని అడిగాడు.. దీంతో నాగ వంశీ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నో చెప్పాడు. అలాగే కొన్ని సినిమాలని టచ్ చెయ్యకుండా ఉండటమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో నెటిజన్లు కూడా ఈ వీడియోపై స్పందిస్తూ ఎందుకు సార్ పాత గాయం మళ్ళీ గుర్తు చేస్తారంటూ మహేష్ బాబు అతడు సినిమాలోని సునీల్ డైలాగ్ మీమ్ తో కామెంట్ చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా 2018లో అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా తమిళ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించాడు. ప్రముఖ సినీ నిర్మాత ఎస్. రాధాకృష్ణ హారికా అండ్ హాసిని ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు. అయితే స్లో నెరేషన్ ఉండటంతో రిలీజ్ రోజు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అయినప్పటికీ దాదాపుగా రూ.125 కోట్లు కలెక్ట్ చేసింది.